మ‌రో సారి కేంద్రాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా..రాహుల్ గాంధీ

విద్యార్థును తొంద‌ర‌గా వెన‌క్కి తీసుకురావాలి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని భార‌తీయులు దుర్భ‌ర ప‌రిస్థితిలో ఉన్నార‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అక్క‌డ ఇరుక్కుపోయిన భార‌తీయుల‌ను కేంద్రం వెంట‌నే సుర‌క్షితంగా భార‌త్‌కు తీసుకురావాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లోని బంక‌ర్‌లో ఉన్న క‌ర్నాట‌క విద్యార్థుల‌కు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశారు. ఈ విజువ‌ల్స్‌లో ఉన్న భార‌తీయ విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ర‌ష్యా టార్గెట్‌గా ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో చాలా మంది ఇరుక్కుపోయారు. మ‌రో సారి కేంద్రాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అక్క‌డ ఇరుక్కున భార‌తీయులు, భార‌తీయ విద్యార్థుల‌ను వెంట‌నే భార‌త్‌కు తీసుకుండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/