కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించిన సోనియా గాంధీ

తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిందో..తెలంగాణ లో కూడా అలాంటి హామీలతో అధికారం చేపట్టాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ తుక్కుగూడ లో కాంగ్రెస్‌ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా సోనియా , రాహుల్ , ఖర్గే లు హాజరు కాగా..తెలంగాణ కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సోనియా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించింది.

  1. మహాలక్ష్మి పథకం..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

  1. రైతు భరోసా..

ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

  1. ఇందిరమ్మ ఇళ్ల పథకం

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

  1. గృహజ్యోతి పథకం

గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

  1. చేయూత పథకం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌

  1. యువ వికాసం

యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం.