అనుమతి లేని లీగ్ పోటీలపై నిషేధం: బిసీసీఐ యోచన

16న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

BCCI
BCCI

Mumbai: పలు రాష్ట్రాల్లో జరుగుతున్నఅనుమతి లేని లీగ్ పోటీలపై నిషేధం విధించాలని బిసీసీఐ నిర్ణయించింది. ఈనెల 16న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గత నెల్లో బీహార్ క్రికెట్ సంఘం బి సీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి లీగ్ పోటీలను నిర్వహించటం వివాదాస్పదమైంది. కొన్ని లీగ్ పోటీలు బెట్టింగ్ కి ఆస్కారం ఇవ్వటం కూడా బి సీసీఐ కి తలనొప్పిగా మారింది . దీంతో అపెక్స్ కౌన్సిల్ లో 14 అంశాల అజెండాలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించ నున్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, సహాయ సిబ్బంది నియామకం తదితర అంశాలను చర్చించనున్నారు. వచ్చే ఏడాది దేశవాళీ టోర్నీల నిర్వహణ, ఒలింపిక్స్ లో క్రికెట్ చేరికకు మద్దతు , జాతీయ క్రీడా సమాఖ్యలో బీసీసీఐ చేరిక వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/