టాప్స్ లో మళ్లీ సానియా ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ వర్గాల వెల్లడి

Sania Mirza selected again in tops
Sania Mirza selected again in TOPS

New Delhi: ఒలింపిక్స్ లో పతకాల సాధనకు కేంద్ర ప్రభుత్వం ప్రెవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీం (టాప్స్)లో మళ్లీ సానియా మీర్జా కి అవకాశం కల్పించారు. పలు గ్రాండ్ స్లాం టైటిల్స్ సాధించిన 34 ఏళ్ళ సానియా , 2017లో ఈ పధకం కింద ఎంపికైంది. అయితే సానియా గాయం కారణంగా పథకం నుంచి దూరమైన ఆమె ఈ పదం నుంచి స్వచ్చంధంగా తప్పుకుంది. ఇపుడు మళ్లీ టాప్స్ పధకంలో సానియా ఎంపికైన్నట్టు స్పోర్ట్స్ అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం సానియా ఇంతకూ ముందే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. సానియా ప్రస్తుతం 157ప ర్యాంకులో కొనసాగుతొంది. అయితే ప్రొటెక్టీవ్ ర్యాంకింగ్ విధానంలో సానియా ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/