మేరీ కోమ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తు ఖాయం

మరో ఇద్దరు భారత బాక్సర్లు అమిత్‌, సిమ్రన్‌ జిత్‌లకు కూడా

Mary Kom
Mary Kom

అమన్‌: భారత స్టార్‌ బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌(51 కేజీలు) టోక్కో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్స్‌లో క్వాలిఫయర్‌ టోర్నీలో సెమీస్‌ కు చేరడంతో ఆమెకు బెర్తు భాయమైంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఐరిష్‌ మాగ్నో పై రెండో సీడ్‌ మేరీకోమ్‌5-0 తేడాతో విజయం సాధించింది. కాగా సెమీస్‌లో యూన్‌ చాంగ్‌(చైనా)తో మేరీ కోమ్‌ తలపడనుంది.2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు) కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అమిత్‌ పంఘాల్‌ 41తో కార్లో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌)ను ఓడించగా.. 24 ఏళ్ల సిమ్రన్‌జిత్‌ 50తో రెండో సీడ్‌ నమున్‌ మోన్‌ఖోర్‌ (మంగోలియా)పై ఘన విజయం సాధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/