బీజేపీ నేతలకు ఊడిగం చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారుః బాల్క సుమన్

తల్లిలాంటి టీఆర్ఎస్ కు ఈటల వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపణ

Balka Suman
Balka Suman

హైదరాబాద్ః తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు. అసలు ఈటల రాజేందర్ కు రాజకీయంగా ఊపిరి పోసిన పార్టీ టీఆర్ఎస్ అని.. కానీ ఆయన బీజేపీ పంచన చేరి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడారు.

‘‘కొన్ని రోజులుగా బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇది చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. 2004కు ముందు ఈటల రాజేందర్ కు అడ్రస్ కూడా లేదు. కనీసం కార్పొరేటర్ గా లేకుండా ఉన్న ఈటలను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినది సీఎం కేసీఆర్. ఒక పెద్దన్నలా చూసుకున్న కేసీఆర్ నే ఇబ్బంది పెట్టేలా, అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్టుగా ఈటల వ్యవహరిస్తున్నారు..” అని బాల్క సుమన్ మండిపడ్డారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/