హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం : ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరంతా రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని మూలమలుపులో పట్టాలు దాటుతుండగా.. ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీస్‌ను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో డీప్ కర్వ్ ఉండటంతో వీరు రైలును గుర్తించలేకపోయారని కొంతమంది అంటున్నారు. నగరంలో సంకల్ప్ అపార్ట్మెంట్ సమీపంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ నగరంలో జీవనం సాగిస్తున్నారని, వీరి మరణం గురించి వీరి కుటుంబ సబ్యులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.