టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు

నోటీసులు జారీ చేసిన దేవాదాయశాఖ కమిషనర్

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/