దేశ ప్రజలకు ప్రముఖుల నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలకు 2020 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడాదంతా ప్రజలకు గొప్పగా ఉండాలని, అందరూ సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం కోసం అందరూ కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడి కూడా ట్వీట్టర్ ద్వారా ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త యేడాదిలో ప్రతి ఒక్కరు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించాలని, 2020 ప్రతిఒక్కరికీ సంతోషకరమైన సంవత్సరం కావాలని.. ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/