దేశంలో కొత్తగా 3,962 కరోనా కేసులు

దేశంలో రికవరీ రేటు 98.74 శాతం

corona virus-india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,962 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా… 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 11,67,037 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/