కస్టడీలో రఘురామను హింసించి కొట్టారు : ‘సుప్రీం’లో రఘురామ తరపు న్యాయవాది వాదనలు

12 గంటలకు విచారణ వాయిదా

MP Raghurama Krishna Raju bail petition arguments
MP Raghurama Krishna Raju bail petition arguments

New Delhi: సుప్రీం కోర్టులో సోమవారం ఎంపీ రఘురామ కృష్ణ రాజు బెయిల్ పిటిషన్ వాదనలు మొదలయ్యాయి. పిటిషనర్ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. రఘురామను అరెస్ట్ చేసిన తీరును రోహిత్గి వివరించారు. కస్టడీలో రఘురామను హింసించి కొట్టారని , ఈ కేసులో కింది కోర్టు ఆదేశాలను అధికారు లు పట్టించు కోలేదని వివరించారు. కేవలం బెయిల్ రావద్దనే 124(ఏ ) కింద కేసు నమోదు చేసారని వివరించారు. రఘురామకు బెయిల్ తో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం అనుమతి ఇవ్వాలని విన్నవించారు. వాదనల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా పడింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/