సీఎం కేసీఆర్ కు భట్టి విక్రమార్క లేఖ

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క..ముఖ్యమంత్రి కేసీఆర్ లు లేఖ రాసారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని విన్నవించారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి నిభట్టి కోరారు. పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని లేఖలో కోరారు.

గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులకు మంచి భోజనం పెట్టాలని, 550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా? అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా.. ఇంత వరకు విద్యార్థులకు పుస్తకాలు అందలేదన్నారు. త్వరలో గురుకుల, ప్రభుత్వ హస్టల్స్, జూనియర్ కళాశాలలు సందర్శిస్తానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.