ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన నటుల జాబితాలో షారుఖ్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన నటుల జాబితాలో ఇండియా నుండి షారుఖ్ కు మాత్రం చోటు దక్కింది. ఈ వార్త ఆయన అభిమానులను , సినీ ప్రముఖులను సంతోషంలో పడేస్తుంది.

బ్రిటన్‌కు చెందిన ‘ఎంపైర్’ మ్యాగజైన్ ఈ జాబితాను వెల్లడించింది. ‘50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్‌టైమ్’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలతోపాటు షారుఖ్ ఖాన్‌కు కూడా ఇందులో చోటు దక్కింది.

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారుఖ్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పే ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ గురించి చెబుతూ.. అతడి కెరియర్‌లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది. దేవ్‌దాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ ఆకాశానికెత్తేసింది. ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.