‘కరోనా’పై సమరం: మహేష్ బాబు పాటలకు వైద్యుల డ్యాన్స్

విజయవాడ లోని ఆసుపత్రిలో వైద్యుల అవగాహనా కార్యక్రమం

Awareness on Corona- Doctors dance to Mahesh Babu songs
Awareness on Corona- Doctors dance to Mahesh Babu songs

Vijayawada : క‌రోనాపై పోరుపై ప్ర‌జ‌ల‌కు మ‌రింత అవ‌గాహ‌న క‌లిగించేందుకు విజ‌య‌వాడ‌లోని ఓ హాస్ప‌ట‌ల్ సిబ్బంది వినూత్న ప‌ద్ద‌తిని ఎంచుకుంది.

ఈ హాస్ప‌ట‌ల్ కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన స్పాన్సర్ గా ఉన్నారు.. గుండె జ‌బ్బుతో ఉన్న చిన్నారుల‌కు మ‌హేష్ సొంత ఖ‌ర్చుతో ఇక్క‌డ చికిత్స అందిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సినీనటుడు మహేష్ బాబు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేస్తూ 75 మంది వైద్యులు, నర్సులు కరోనాపై అవగాహన కల్పించారు.

‘పదర పదర పదర’ పాటతో పాటు ‘వచ్చాడయ్యే సామి’, ‘కాలమనే నదిలో’, ‘చలో రే చలో’ పాటకు వారంతా డ్యాన్సులు చేశారు.

సూపర్‌స్టార్‌ స్టైల్‌లో కరోనా జాగ్రత్తలు చెబుతున్నామని చెప్పారు.

చివరకు ‘సరిలేరు నీకెవ్వరు’ పాటను వినిపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఈ పని చేశారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/