ట్విటర్‌కు మరోషాక్
ట్విటర్‌కు చట్టపరమైన రక్షణ తొలగింపు
twitter
న్యూఢిల్లీ: ట్విటర్ కు కేంద్రం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమాకాలపై ఇటీవల కేంద్రం తుది హెచ్చరిక జారీ చేసింది.
ఈ విషయంలో విఫలమైన కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విటర్ కోల్పోయిందని, దీంతో ఇకపై భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహింఆరంటూ పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో నిబంధనలను పాటించని ఏకైక టెక్ ప్లాట్‌ఫాం ట్విటర్ అని కూడా పేర్కొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/