రష్యాలో కుప్పకూలిన ఆయిల్ ట్యాంకర్

నదులు కలుషితం-ఎమర్జెన్సీ విధింపు

Polluting rivers
Polluting rivers

రష్యా: రష్యాలో  భారీ ఆయిల్ ట్యాంకర్ కుప్పకూలింది. దీంతో  135 చదరపు మైళ్ల ప్రాంతంలో ఆయల్ వ్యాపించి మొత్తం కలుషిత మైంది .

ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు.   ఆర్కిటిక్ సర్కిల్‌లో 21,000 టన్నుల డీజిల్ సామర్థ్యం ఉన్న ట్యాంకర్ కూలిపోయింది.

దీంతో దాదాపు ఆరు వేల టన్నుల ఆయిల్ భూమిలోనూ, 15,000 టన్నుల ఆయిల్  నీటిలోనూ కలిసిపోయింది.

అంబర్‌నయ, దలద్యాకన్ నదులు, వాటి ఉపనదుల్లోకి భారీగా ఆయిల్ చేరడంతో వాటిలో నీరు ఎర్రబారింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/