అవతార్ 2 నుండి మరో ట్రైలర్ వచ్చేసింది

అవతార్ 2 నుండి మరో ట్రైలర్ వచ్చేసింది. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తూ ‘అవతార్ 2’ మేకర్స్ రెండు వారాల క్రితం ఫస్ట్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది ఇంత వరకు వున్న అంచనాల్ని అమాంతం పెంచేసింది.

తాజాగా మరో ట్రైలర్ ని విడుదల చేశారు. పండోరా సమీపంలోని సముద్ర జీవితానికి అలవాటు పడిన జేక్ నేయిటిరి ..వారి కుటుంబం..పిల్లల చేసే విన్యాసాలు.. మనుగడ కోసం వారు పడే ఇబ్బందులు.. తమ తెగ వారి కోసం జేక్ నేయిటిరి చేసే యుద్ధ విన్యాసాలు.. సముద్ర గర్భంలో వింత జీవులని వారి వాహనాలుగా మలుచుని చేసే విన్యాసాలు.. శతృ వర్గంపై చేసే యుద్దం వంటి విజువల్స్ వావ్ అనిపిస్తున్నాయి. ‘అవతార్’ని మించి ‘అవతార్ 2’ వుంటుందని సెకండ్ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ‘అవతార్’ సినిమాకి కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు చేస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా ముందుగా ”అవతార్: ది వే ఆఫ్ వాటర్” ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ”అవతార్ 2” లో సముద్ర గర్భంలోని తీసుకెళ్లి మరో సరికొత్త ఊహా లోకాన్ని పరిచయం చేశారు. సముద్రంపై అవతార్స్ చేస్తున్న విన్యాసాలు మరియు అబ్బురపరిచే గ్రాఫిక్స్ కనువిందు చేస్తున్నాయి. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

YouTube video