జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ : రెండో స్టేట్మెంట్ లో కీలక విషయాలు బయటపెట్టిన బాధితురాలు

second statement jubilee hills molestation case

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న జూబ్లీహిల్స్​ మైనర్ బాలిక రేప్​ కేసుకు సంబదించి రోజుకో విషయం బయటకు వస్తూనే ఉంది. ఘటన జరిగి దాదాపు పది రోజులు అవుతున్న ఇంకా కేసుకు సంబదించి కీలక విషయాలు బయటకు వస్తుండడం తో మీడియా లో హైలైట్ గా నిలుస్తూనే ఉంది. ఇప్పటికే బాధితురాలి నుండి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీస్ అధికారులు..మరోసారి ఆమె దగ్గరి నుండి స్టేట్ మెంట్ తీసుకొని కీలక విషయాలు రాబట్టారు.

ఇంటి వద్ద దింపుతామని ట్రాప్‌ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. బాధితురాలిని వెంబడించి క్యాబ్‌ బుక్‌ చేస్తామంటూ నిందితులు ఫోన్‌ లాక్కున్నారు. ఫోన్‌ సిగ్నల్‌ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామంటూ బెంజ్‌ కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాధితురాలి హ్యాండ్‌ బ్యాగ్‌, కళ్లజోడు లాక్కున్నారు. కాన్స్‌ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్‌ చేశారు. ఇన్నోవాలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది.

ఈ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసులు విచరించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో మాలిక్‌ను విచారిస్తున్నారు. అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల గురించి తీస్తున్నారు. తప్పించుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్నోవా వాహనం విషయంలో మరికొందరి పాత్రపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈరోజు రాత్రికి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యు బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లనున్నారు పోలీసులు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఇన్నోవా కారును దాచి పెట్టిన ఫాంహౌజ్ ప్రాంతానికి సాదుద్దీన్ ను తీసుకెళ్లి వివరాలు సేకరించనున్నారు.

మరోవైపు నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లకు ప్రభుత్వ వైద్యులతో పోటెన్సీ టెస్ట్ చేయించనున్నారు పోలీసులు లైంగిక పటుత్వ నిర్ధారణ కోసంఈ టెస్ట్ చేయించనున్నారు. చార్జిషీట్ దాఖలకు ఈ పరీక్ష కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.