చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

chandrababu-naidu

అమరావతిః ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారించనుంది. మరోవైపు ఈ కేసులో గత విచారణ సందర్భంగా ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. దీంతో, కేసు తదుపరి విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈరోజుకు వాయిదా వేశారు. ఇంకోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను నిన్న హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను కూడా జస్టిస్ మల్లికార్జునరావే మంజూరు చేయడం గమనార్హం.