ప్రజల సంక్షేమాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదుః అచ్చెన్నాయుడు

కరవు మండలాల ప్రకటనలో రైతులకు అన్యాయం చేశారని మండిపాటు

TDP AP president Atchannaidu

అమరావతిః రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా కేబినెట్ భేటీలో కనీసం చర్చించలేదని విమర్శించారు. సీఎం జగన్ తన మొత్తం సమయాన్ని చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కరవు మండలాల ప్రకటనలో కూడా రైతులకు అన్యాయం చేశారని అన్నారు. కరవు మండలాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందన ఒక్క మండలం కూడా లేకపోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఈ జిల్లాలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2024లో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కరవు పరిహారాన్ని అందిస్తామని తెలిపారు.