తొలిప్రేమ ప్రీ రిలీజ్ హంగామా మాములుగా లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ కలయికలో 1998 లో విడుదలైన మూవీ తొలిప్రేమ. ఈ మూవీ అప్పట్లోనే ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. చాలామంది ఈ సినిమాను చూసి..ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వారు ఉన్నారు. ప్రస్తుతం రీ – రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న వేళా..ఈరోజు (జూన్ 30) తొలిప్రేమ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటీపడ్డారు. భారీ ఎత్తున కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పటు చేసి నానా హంగామా చేసారు. థియేటర్ల లోపల కూడా పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఓ థియేటర్ లో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి సన్నివేషం పలు థియేటర్లలో కనిపించింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఈయన నటించిన బ్రో మూవీ జులై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా చిత్ర ట్రైలర్ అభిమానులను , ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.