సీఎం కేసీఆర్ కు షూ గిఫ్ట్ గా పంపిన షర్మిల..

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ కు షూ ను గిఫ్ట్ పంపి తనతో పాదయాత్ర చేయాలనీ డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలంటూ కోరింది. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవంటున్న సీఎం కేసీఆర్ అది నిజం అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిజం కాకపోతే సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తన పాదయాత్ర ఆగిన స్థలం నుంచి షర్మిల తిరిగి యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా గురువారం ఆమె మీడియాతో పాటు పాదయాత్రలో తనతోలిసి నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

గవర్నర్ తమిళి సైతో భేటీ కావాలనుకున్నామని, అయితే.. పాదయాత్రకు ఆలస్యమవుతుండటంతో కలువలేకపోయినట్లు షర్మిల చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని శంకరం తండా గ్రామం నుండి మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సాయంత్రం శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. షర్మిల ఈ రాత్రికి నెక్కొండలో బస చేయనున్నారు.