ముఖ్యమంత్రి బలహీన వర్గాల పొట్టకొడుతున్నారు

మయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారు

acham naidu
acham naidu

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ బలహీనవర్గాల పొట్టకొడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు బలహీన వర్గాలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్‌..ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. బీసీల నిధులు అమ్మఒడి పథకానికి మళ్లించారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న అన్నాయాన్ని వివరిస్తూ ఒక యువకుడు వీడియో పోస్ట్‌ ద్వారా ప్రశ్నిస్తే అతడిని అరెస్టు చేయడంపై అచ్చెన్న నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మంచి చేయడానికి అధికారం ఇస్తే అధికారం అడ్డం పెట్టుకొని టిడిపి నేతలపై కక్షసాధింపునకు వినియోగిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/