ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడి చేశారు: అచ్చెన్నాయుడు

తెనాలిలో టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: అచ్చెన్నాయుడు

అమరావతి : తెనాలిలో టీడీపీ నేతలపై వైస్సార్సీపీ వర్గీయులు దాడి చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైస్సార్సీపీ నేతకు స్థలం అమ్మలేదని దుకాణాన్ని కూల్చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడులు చేయడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు.

తెనాలిలో ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన వైస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టరా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. విద్వేషం, విధ్వంసమే వైస్సార్సీపీ అజెండా అని విమర్శించారు. బాధితులపైనే అక్రమ కేసులు పెడుతూ, వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/