ఉక్రెయిన్‌ ముస్లింలు రంజాన్ మాసంలోనూ పోరాటంలో పాల్గొనాలి

కీవ్ : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఖ‌తార్‌లో జ‌రుగుతున్న దోహా ఫోర‌మ్ స‌మావేశంలో వీడియోలో మాట్లాడారు. ర‌ష్యా వ‌ల్ల జ‌రిగిన ఇంధ‌న స‌ర‌ఫ‌రా న‌ష్టాన్ని పూడ్చేందుకు అర‌బ్ దేశాల‌న్నీ ఉత్ప‌త్తిని పెంచాల‌ని త‌న సందేశంలో కోరారు. ఐక్య‌రాజ్య‌స‌మితితో పాటు ప్ర‌పంచ దేశాలు ఉక్రెయిన్‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. మారియ‌పోల్ న‌గ‌రంలో జ‌రిగిన ధ్వంసాన్ని.. సిరియాలోని అలెప్పొలో జ‌రిగిన న‌ష్టంతో పోల్చారు. మ‌న పోర్ట్ న‌గ‌రాల‌ను ర‌ష్యా ధ్వంసం చేస్తోంద‌ని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ నుంచి ఎగుమ‌తి ఆగిపోతే అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయ‌న్నారు.

గోధుమ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో మిడిల్ ఈస్ట్ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయ‌న్నారు. త‌న వ‌ద్ద అణ్వాయుధాల‌తో ప్ర‌పంచాన్ని ర‌ష్యా భ‌య‌పెట్టిస్తోంద‌న్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న ముస్లింలు.. రంజాన్ మాసంలోనూ పోరాటంలో పాల్గొనాల‌ని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/