ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదు

ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తా: అశోక్‌ గజపతిరాజు

Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju

విజయనగరం: మాన్సాన్‌ ట్రస్టు వ్యవహారంలో ఇప్పటి వరకు జీవోను బయటపెట్టలేదని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. ట్రస్టు బోర్డు చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. దాతలు ఇచ్చిన భూమలు ఆలయానికే చెందాలని తెలిపారు. పిల్లల భవిష్యత్‌ కోసమే ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత బోర్డు చైర్మన్‌ సంచిత ఆధార్‌ కార్డును పరిశీలిస్తే ఆమె ఎక్కడ వారో అందరికీ తెలుస్తుందన్నారు. ప్రభుత్వ తీరుతో భవిష్యత్‌ తరాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాత్రిరాత్రికే జీవో ఇచ్చారని, అంత రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తానని అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/