చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండగా నందమూరి రామకృష్ణ ఏమోషనల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు తిరగరాశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడం తో ఈరోజు సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల నేతలు , సినీ ప్రముఖులతో పాటు నారా , నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండగా నందమూరి రామకృష్ణ ఏమోషనల్ అయ్యారు. టిడిపి పార్టీకి జై కొడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. కాగా మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నారు.