పూర్ణవికసిత పద్మం స్థానంలో రాష్ట్ర చిహ్నం!!
తాజాగా సీఎం ఆదేశాలతో మార్పు


అమరావతి: చంద్రబాబునాయుడు హయాంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో, సిఎం సీటు వెనక ఉండే బంగారు వర్ణంలో కనిపించేలా ఏర్పాటు చేసిన పూర్ణవికసిత పద్మం, ప్రభుత్వం మారినప్పటికి కూడా దీనిని కొనసాగిస్తూ వస్తున్నారు.
దీని స్థానంలో అధికారులు ఏపి ప్రభుత్వ చిహ్నన్ని అమర్చారు మంగళవారం వరకూ ఉన్న పద్మం వంటి చక్రం బుధవారం నాటికి మారి పోయింది.
ఆ స్థానంలో ప్రభుత్వ అధికారిక చిహ్నం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/