ఉగ్ర‌వాదుల కాల్పులు.. ఆర్మీ జ‌వాన్ మృతి

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో ఆర్మీ జ‌వాన్ ప్రాణాలు కోల్పోయాడు. రాజ్‌పొరా ఏరియాలోని హంజిన్ గ్రామంలో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో అక్క‌డ బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హించ‌గా, ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. మిలిటెంట్ల కాల్పుల‌ను బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. ఓ జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ జ‌వాను క‌న్నుమూశాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/