గూడూరులో ప్రేమోన్మాది ఘాతుకం!

యువతి దారుణ హత్య

చివరకు తనూ బలవన్మరణానికి యత్నం – పోలీసుల రంగ ప్రవేశంతో వెలుగు చూసిన ఘటన

Tejaswini-Dead-body-File

Guduru: : స్వర్ణభారతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సుధాకర్‌, సరిత దంపతులిద్దరూ ఉపాధ్యాయులు. వీరి కుమార్తె తేజస్విని (20) గూడూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. సొసైటీకి చెందిన సుధాకర్‌ స్నేహితుడు చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేష్‌ నాలుగేళ్లుగా తేజస్వినిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలియడంతో ఏడాది క్రితం వెంకటేష్‌ తండ్రికి విషయం చెప్పాడు. దీంతో వెంకటేష్‌కు బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు. అయినా వెంకటేష్‌ తరచూ తేజస్వినికి ఫోన్‌ చేసి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేదిస్తుండేవాడు. ఈ విషయం తేజస్విని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె ఫోన్‌ నెంబర్‌ను మార్చివేశారు. తేజస్విని ఫోన్‌ నెంబర్‌ తెలపాలంటూ ఆమె తల్లిదండ్రులకు వెంకటేష్‌ మెసేజ్‌లు పెట్టేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా వెంకటేష్‌ గూడూరులోనే ఉంటున్నాడు.

గురువారం తేజస్విని తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లిపోయారు. తేజస్విని, ఆమె తమ్ముడు హిమసాత్విక్‌ ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ సమయంలో వెంకటేష్‌ అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకుని తేజస్విని ఫోన్‌ నెంబర్‌ కోసం తన స్నేహితుడిని పంపాడు. దీంతో తేజస్విని తన ఫోన్‌ను తమ్ముడికి ఇవ్వడంతో ఫోన్‌ తీసుకుని బయటికి బయటికి వచ్చేశాడు. ఇదే సమయంలో వెంకటేష్‌ ఇంటిలోకి ప్రవేశించి తేజస్వినిని గదిలోకి తీసుకువెళ్లి గడియపెట్టుకున్నాడు. ఈ విషయం హిమసాత్విక్‌ తన తండ్రి సుధాకర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో సుధాకర్‌ 100కు డయల్‌ చేయడంతో పాటు చట్టుపక్కల వారికి తెలిపారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లగా మంచంపై తేజస్విని పడి ఉంది. వెంకటేష్‌ ఫ్యానుకు ఉరివేసు కుని వెలాడుతూ కనిపించాడు. దీంతో ఇద్దరినీ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్ప టికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం వెంకటేష్‌ను నెల్లూరుకు తరలించారు. 

యువతి తండ్రి సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. చిన్న కత్తితో గొంతులో పొడిచి, టవల్‌ గొంతుకు చుట్టి లాగి చంపి ఉంటాడని భావిస్తున్నాం. ఆత్మహత్యకు యత్నించిన వెంకటేష్‌ను ఆసుపత్రికి తరలించా రు. అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నాం. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రూరల్‌ సీఐ శ్రీని వాసులురెడ్డి, ఎస్‌ఐ ఆదిలక్ష్మి దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/