సంక్రాంతికి ఊరు వెళ్లే వారికీ గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ అంటే సంక్రాంతి అని చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో ఈ పండుగ వస్తుందంటే చాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తెలుగువారు తమ సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను కన్నుల పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరుపుకోవాలని భావిస్తున్నారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలు కాబోతున్నాయి .

ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. నేటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు ప్రారంభించబోతుంది. ఈనెల 14 వరకు, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నడపబోతుంది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అన్ని సాధారణ సర్వీసులు ఉంటాయని , స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. అలాగే ముందస్తు రిజర్వేషన్లకు10% రాయితీ ఇస్తామని వెల్లడించింది. అంతేకాదు డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించింది.

ఇటు తెలంగాణ ఆర్టీసీ సైతం సంక్రాంతి సందర్భంగా 4484 ప్రత్యేక బస్సులు నడపబోతుంది. అంతే కాదు సంక్రాంతికి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ క్రాస్ లోను రోడ్ లోని ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, KPHP , బోయినపల్లి , గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడపరున్నట్లు పేర్కొన్నారు.