జీఎస్టీ స్లాబ్‌ రేటు పెరుగుదల

నెలాఖరులోగా కౌన్సిల్ ఎదుట నివేదిక

GST slab‌ rate increase
GST

త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కనిష్ఠంగా ఉన్న 5 శాతం స్లాబ్‌ రేటును 8 శాతానికి పెంచనున్నట్లు తెలిసింది. సంబంధిత నివేదిక నెలాఖరులోగా కౌన్సిల్ ముందుకు రానున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. నిత్యావసరాలను టాక్స్ పరిధి నుంచి తప్పించటం లేదా కనిష్ఠ శ్లాబ్ కింద పన్ను విధిస్తారని సమాచారం. లగ్జరీ వస్తువులు, సేవలను గరిష్ఠ శ్లాబ్ రేటు 28% కింద పన్ను విధించనున్నారు.

ప్రస్తుతం 5 శాతంగా ఉన్న స్లాబ్‌ ను 8 శాతానికి పెంచటం ద్వారా ప్రభుత్వానికి అధనంగా ఏడాదికి రూ. 1.50 లక్షల కోట్ల ఆధాయం సమకూరనుంది. జీఎస్టీలో ప్రతి ఒక్కశాతం టాక్స్ రేటును పెంచటం వల్ల రూ. 50 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ఒనగూరనుంది. . ప్రస్తుతం ఉన్న రేట్లను 8%, 18%, 28% గా మార్చాలని కొందరు మంత్రులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదవ వల్ల ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్‌ 18 శాతానికి పెరగనుంది. కాగ్ర, ప్రస్తుతం ప్యాకింగ్ చేయని, బ్రాండింగ్ చేయని, డెయిరీ ఉత్పుత్తులు జీఎస్టీ పరిధిలో లేవు..

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/