ఈరోజుతో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఈరోజుతో ముగియనుంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలను కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజులకే ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యం అందించి ప్రజల్లో నమ్మకం పెంచింది. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకుగాను ప్రజా పాలన కార్యక్రమం గత గత నెల 28న చేపట్టింది. తొలి రోజు నుంచే ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. డిసెంబర్ 31, జనవరి 1న రెండు రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం..తిరిగి 2 నుండి ప్రారంభించింది. ఇప్పటివరకు ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగగా.. నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

నిన్న శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో, మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. అభయ హస్తంకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15, 55,704 అప్లికేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజైన శనివారం కూడా ప్రజల నుండి భారీ సంఖ్యలో దరఖాస్తులు అదుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర అవసరాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈనెల 17 లోగా పూర్తి చేయాలని సిఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.