అంతరిక్షంలో ఇస్రో ఫ్యూయల్ సెల్ పరీక్ష విజయవంతం

జనవరి 1న ఫ్యూయల్ సెల్ ను నింగిలోకి పంపిన ఇస్రో

ISRO successfully tests fuel cells to generate power in space

న్యూఢిల్లీః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. ఈ నెల 1వ తేదీన పీఎస్ఎల్వీ సీ58తో పాటు నింగిలోకి పంపిన ఫ్యూయల్ సెల్ ను విజయవంతంగా పరీక్షించింది. దాని నుంచి డేటాను సేకరించడంతో పాటు, దాని పనితీరును విశ్లేషించింది. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ ఫ్యూయల్ సెల్ రసాయనిక చర్యను జరిపి, విద్యుత్ ను ఉత్పత్తి చేసి, కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. ఆక్సిజన్, హైడ్రోజన్ లతో రసాయనిక చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేస్తుంది.