గుంటూరు టోల్​ప్లాజా దగ్గర ప్రమాదానికి గురైన ఏపీఎస్​ ఆర్టీసీ బస్సు

గుంటూరు జిల్లా టోల్​ప్లాజా దగ్గర ఏపీఎస్​ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా, టోల్​ప్లాజా దగ్గర ఏపీఎస్​ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడం తో బస్సు కాస్తా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు 10 మంది గాయపడ్డారు.

వెలగపూడి నుంచి గుంటూరుకు వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. కాజా టోల్​ ప్లాజా వద్ద ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి బస్సును ఆపేశాడు. ఈ క్రమంలో బస్సు స్పీడుకు ముందు టైర్ విరిగిపోయింది. ప్రమాదం గురించి స్థానికులు అంబులెన్స్​కు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో కాజా టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్​కు కొంతసేపు అంతరాయం కలిగింది.