ప్రకాశం జిల్లా పడమర వీరాయపాలెంలో క్షుద్రపూజల కలకలం

టెక్నాలజీ రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి చెందుతుంటే..ఇంకా పలు గ్రామాల్లో మూఢనమ్మకాలను ప్రజలు నమ్ముతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని జనం నమ్ముతుండడం ఆశ్చర్యం వేస్తుంది. ప్రకాశం జిల్లా పడమర వీరాయపాలెంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గ్రామం నుంచి భూమయ్య పాలెం వెళ్లేదారిలో చెరువు కట్టఫై మనిషి ఆకారంలో ముగ్గు వేసి, దానిపై నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, పసుపు, కుంకుమ వేశారు. మరోపక్క కందులు, శనగలు చుట్టూరా పెట్టారు. కొబ్బరికాయలు పగులగొట్టి అటూ, ఇటూ పెట్టారు… కోడిని కోసి రక్తం చల్లినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.. వీటన్నింటిని ఉపయోగించి చెరువుకట్టపై క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్రామంలో చెరువు కట్టపై క్షుద్ర పూజలు జరగాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ క్షుద్ర పూజలు చేతబడి, బాణామతి కోసమా… లేదా గుప్త నిధుల కోసమా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.