బలగం ఫస్ట్ వీక్ కలెక్షన్స్

జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. గత శుక్రవారం విడుదలైన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

సందేశాత్మకమైన కథతో రూపొందిన ‘బలగం’ మూవీ కాన్సెప్టు గురించి తెలియడంతో దీనిపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమా కూడా మొదటి ఆట తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. మొదటివారానికి గాను నైజాం ఏరియాలో రూ. 4.16 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.76 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 6.92 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.00 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి వారం రోజుల్లో రూ. 14 లక్షలు గ్రాస్ వసూలు అయింది.