ఆక్స్‌ఫర్డ్‌ టీకా అభివృద్ధిలో మరో ముందడుగు

కోతుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షణ

Oxford-vaccine

లండన్‌: కరోనా వైరస్‌ను నియత్రించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యంలోనే ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఆశాజనకంగా కనిపిస్తుంది. తాజాగా ‘సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌19’ అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేసింది. కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలించారు. ఆరు కోతులకు పరిశోధకులు దీన్ని ఇచ్చి 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్‌ కారణంగా వచ్చే న్యుమోనియాను ఈ టీకా‌ నిలువరించగలిగినట్లు తేల్చారు.

కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేసుకోగలిగాయని చెప్పారు. కోతుల్లో వైరల్‌ లోడును తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా ఉపయోగపడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది. అయినప్పటికీ కరోనా సోకకముందే దాన్ని పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ తన స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారా మనిషి కణాల్లోకి చొరబడుతుంది. జలుబు వంటి వాటిల్లోనూ అడినో వైరస్‌లోనూ ఇలాంటి ప్రొటీన్‌ ఉంటుంది. అడినోవైరస్‌ను బలహీనపర్చడం ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/