అపోలో ఆసుపత్రిలో కరోనా కేసు:ఉపాసన

బాధితుడికి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స

upasana
upasana

హైదరాబాద్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో గుర్తించామని కొణిదెల ఉపాసన తన ట్విట్టర్‌ ఖాతా ద్వార వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్, వీడియోను పెట్టన ఆమె, కరోనా వైరస్ పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు. సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.

https://twitter.com/upasanakonidela/status/1234690268105822209

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/