ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం

కీలక అంశాలపై నేటి సమావేశంలో చర్చ

అమరావతి : ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. తాజాగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్ఆర్ఏ శ్లాబులు, ఐఆర్ రికవరీ, ఇతర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాగా, ఈ భేటీ ద్వారా ఇరువర్గాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రుల కమిటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/