హెలికాప్టర్ ప్రమాదం నుండి బయటపడ్డ సుష్మా అందారే

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హోరు నడుస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ పూర్తిగా..మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా..శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అందారే పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలింది. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన సుష్మ హెలికాప్టర్ కోసం వేచి చూస్తుండగా, ల్యాండ్ అవుతూ అది ఆమె కళ్ల ముందే కుప్పకూలింది.

దీనికి సంబదించిన వీడియో ను ఆమె షేర్ చేసారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ రూటర్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్ ల్యాండ్‌ సైట్‌కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో పక్కకు జారుకుంది. ఆపై ల్యాండ్ అవుతూ భూమిని ఢీకొట్టడంతో దుమ్ముధూళి ఒక్కసారిగా కమ్మేసింది.