అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..అభిమానులకు సారీ చెప్పారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ (KALKI 2898 AD) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. ఎంతో గ్రాండ్ లెవెల్లో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో ప్రభాస్ లుక్‌కి యావత్ సినీ ప్రపంచమే ఫిదా అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ మార్వెల్స్ హీరోలా కనిపించిన ప్రభాస్ అందరి మనస్సులు దోచుకున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్​తో నిర్మస్తోంది. అయితే రీసెంట్​గానే ఈ చిత్రంలోని బుజ్జి అనే ఓ స్పెషల్ క్యారెక్టర్​ను మేకర్స్​ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లైఫ్​లో స్పెషల్ పర్సన్​గా ఉన్న ఓ రొబోటిక్​ కారు ఈ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. దీనికి మహానటి కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందిస్తోంది. సినిమాలో ప్రభాస్​తో పాటుగా ఈ పాత్ర కీలకంగా ఉండబోతుందని మేకర్స్​ చెబుతున్నారు.

దీంతో ఈ బుజ్జి ఎలా ఉంటుందా అనే ఆసక్తి, ఉత్కంఠ అందరిలో నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠతకు తెరదించుతూ బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేశారు మేకర్స్. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో ఓ స్పెషల్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించి అభిమానుల సమక్షంలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభాస్​ వీరలెవల్​లో తన బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్​లో తన కారుతో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్​లో జోష్ నింపేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తన మాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. ‘‘హాయ్ డార్లింగ్స్.. బుజ్జి – భైరవ గ్లింప్స్ ఎలా ఉంది. ఎంజాయ్ చేశారా. అంటే ఈ ఈవెంట్‌కి తక్కువ మందిని తీసుకురావడానికి.. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే.. అందరికీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము.

ముఖ్యంగా చెప్పాలంటే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కమల్ హాసన్‌కు వంద దండాలు సార్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసిన నేను అచ్చం కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. అలాంటి నేను ఇప్పుడు ఆయనతో నటించడం అంటే మామూలు విషయం కాదు. థాంక్యూ కమల్ సార్’’ అంటూ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

YouTube video