మే 8వ తేదీన తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆల‌యం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర‌లో భాగ‌మైన బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన రీఓపెన్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శీతాకాలం దృష్ట్యా ఆ ఆల‌యాన్ని మూసివేసిన విష‌యం తెలిసిందే. మే 8వ తేదీన ఉద‌యం 6.15 నిమిషాల‌కు ఆల‌య ద్వారాల‌ను తెర‌వ‌నున్న‌ట్లు చార్‌థామ్ బోర్డు స‌భ్యులు తెలిపారు. గ‌త రెండేళ్ల నుంచి క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఆల‌యంలోకి భ‌క్తుల ప్ర‌వేశంపై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/