చంద్రబాబుపై మంత్రి అనిల్‌ వ్యంగ్యాస్త్రాలు

ఆయన ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగలరని ఎద్దేవా

anil kumar yadav
anil kumar yadav

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి అనిల్‌ కుమార్‌ అసెంబ్లీలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబు ఇవాళ కొత్తగా పొత్తులు గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేరంటూ విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన ఇలా అన్ని పార్టీలు అయిపోయాయంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగలరని వ్యంగ్యం ప్రదర్శించారు. కానీ సిఎం జగన్ సింహం లాంటివాడని, ఆయన నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సిపి సింగిల్ గానే పోటీ చేస్తుందని, 2024లో కూడా తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని అనిల్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పే ధైర్యం టిడిపికి ఉందా అంటూ సవాల్ విసిరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/