రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు..

రేపు (బుధువారం) ఇంటర్ ఫలితాలను వెల్లడించబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్‌ ఫలితాలను విడదల చేయనున్నారు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే. విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.