స్కిల్ స్కామ్ కేసు.. చంద్రబాబు కి బెయిల్ మంజూరు

ap-high-court-judgment-on-chandrababu-bail-in-skill-case

అమరావతిః స్కిల్ స్కామ్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బాబు తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. తాజాగా తీర్పును ఇచ్చింది. ఇదే కేసులో చంద్రబాబు ఇటీవలే మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు నవంబర్ 17న జరిగాయి. అయితే తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది.

చంద్రబాబు తరపున సీరియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రాజకీయ పెద్దలు చెప్పినట్టు ఏపీ సీఐడీ నడుచుకుంటుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా.. రాజకీయ కక్షతో చంద్రబాబు పై తప్పుడు కేసులు నమోదు చేశాయని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసి. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించింది.