భూమా అఖిలప్రియ భర్తకు బెయిల్ మంజూరు

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ, భార్గవ్ రామ్ లపై కేసులు

ap-high-court-grants-bail-to-bhuma-akhila-priya-husband

అమరావతిః టిడిపి నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మరో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో అఖిలప్రియను, భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న అఖిలప్రియకు కోర్టు ఇంతకు ముందే బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు భార్గవ్ రామ్ కు ఊరట లభించింది. భార్గవ్ రామ్ బెయిల్ పై హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.