మేము అధికారంలోకి రాగానే లాయర్లకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం: లోకేశ్‌

tdp-nara-lokesh-meet-with-advocates-in-kadapa

కడప: సీఎం జగన్‌ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కడపలో న్యాయవాదులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ‘‘న్యాయవాదులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. టిడిపి అధికారంలోకి రాగానే లాయర్లకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్‌ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కోర్టుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను స్వయంగా చూశా. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, బాత్ రూంలు కూడా లేవు. టిడిపి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుతో పాటు న్యాయశాఖకు అధిక నిధులు కేటాయిస్తాం. మొదటి మూడేళ్లలోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తాం’’ న్యాయవాదులకు హెల్త్‌కార్డులను అందజేస్తాం. ఎవరరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందిస్తాం. నామినేటెడ్‌ పదవుల్లోనూ న్యాయవాదులకు అవకాశం కల్సిస్తాం. అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.