చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతాం – మంత్రి అమర్నాథ్

చంద్రబాబు ఐటీ కేసులపై వరుస పెట్టి వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖాయమని..తప్పు చేసిన బాబు ఎక్కడికి వెళ్లలేరని అంటూ వస్తున్నారు. తాజాగా మంత్రి అమర్నాథ్ చంద్రబాబు ఐటీ నోటీసుల ఫై స్పందించారు.

దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని విమర్శలు చేశారు. రూ. 118 కోట్ల లంచాల కేసులో తన పీఏ శ్రీనివాస్ ను, బ్రోకర్ మనోజ్, వాస్ దేవ్, పార్థసారథిలను చంద్రబాబు దేశం దాటించి, పారి పోయేలా చేశాడన్నారు. తప్పు చేయనప్పుడు వారిని ఎందుకు దేశం దాటించారని మంత్రి అన్నారు. ఒకరు అమెరికా, మరొకరు దుబాయ్ పారిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.

లంచాలు తీసుకున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని మంత్రి అమర్నాథ్ అన్నారు. అది తెలిసే తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ ఎందుకు స్పందించడం లేదని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.