నితిన్ కొత్త చిత్ర టైటిల్ “మాచర్ల నియోజకవర్గం”

నితిన్ కొత్త చిత్ర టైటిల్ “మాచర్ల నియోజకవర్గం”

విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే టైటిల్ తో కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా మాస్ట్రో సినిమాలో నటించాడు. ఈ నెల 17 న డిస్నీ+హాట్ స్టార్ ఓటిటిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే తన 31 వ చిత్రాన్ని వినాయకచవితి సందర్భాంగా ప్రకటించారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కున్న ఈమూవీ కి “మాచర్ల నియోజకవర్గం” అనే డిఫరెంట్ పొలిటికల్ టైటిల్ ప్రకటించింది. ఇక ఈ టైటిల్ చూస్తుంటే.. సినిమా స్టోరీ మొత్తం రాజకీయ నేపథ్యం లో నడిచేలా కనిపిస్తోంది.